![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -441 లో.. భాగ్యం డమ్మి ఆక్సిడెంట్ చెయ్యమని రౌడీకి చెప్తుంది. అదే రౌడీకి డమ్మీ కాదు నిజంగానే ఆక్సిడెంట్ చెయ్యమని సేనాపతి చెప్తాడు. ఇక రోడ్లపై మేకులు ఉండటం వల్ల చందు బైక్ పంచర్ అవుతుంది. దాంతో ప్రేమని తీసుకొని వెళ్ళమని ధీరజ్ కి ఫోన్ చేస్తాడు. ఇక ధీరజ్ కి వెనకాల నుండి లారీ వస్తుంటే బావ అని ప్రేమ పిలుస్తుంది కానీ అతను చూడడు.. దాంతో చందు దగ్గరికి వేగంగా వెళ్ళి తనని పక్కకి నెట్టుతుంది. ఇక చందుని ఢీకొట్టాల్సిన లారీ ప్రేమని ఢీకొడుతుంది. అప్పుడే అటుగా వస్తున్నా ధీరజ్ చూసి షాక్ అవుతాడు. ప్రేమని వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. ప్రేమని ఆ సిచువేషన్ లో చూసి ధీరజ్ ఎమోషనల్ అవుతాడు. అప్పుడే ఇంట్లో అందరు హాస్పిటల్ కి వస్తారు. అసలు ఏమైందని రామరాజు అడుగగా ప్రేమ నన్ను కాపాడబోయి తన ప్రాణాల మీదకి తెచ్చుకుందని చందు బాధపడుతాడు.
ధీరజ్ పక్కకి వెళ్లి ఏడుస్తుంటే నర్మద వెళ్లి ప్రేమకి ఏం కాదు ధీరజ్ నువు కూల్ గా ఉండమని చెప్తుంది. ఇదంతా నా వల్లే వదిన.. తను కాలేజీలో డ్రాప్ చెయ్యమంటే నేనే వినకుండా కోపంగా వెళ్ళాను.. తనని తీసుకొని వెళ్లి ఉంటే ఇదంతా జరిగేది కాదని ధీరజ్ బాధపడుతాడు. మరొకవైపు భాగ్యం, వల్లి మాట్లాడుకుంటారు. నీ వల్లే ఇదంతా.. పాపం ప్రేమకి ఎలా ఉందో ఏంటో నువ్వు చెప్పిందల్లా చేస్తూ నా కాపురం నేనే కూల్చుకున్నానని వల్లి అంటుంది. ప్రేమ అమాయకురాలు.. నేను ఏం చేసినా నన్ను ఎప్పుడు బానే చూసుకుందని భాగ్యంపై వల్లి సీరియస్ అవుతుంది. నేను డమ్మి ఆక్సిడెంట్ చెయ్యమంటే వాడేంటి అలా చేసాడు.. ఏదో జరిగిందని భాగ్యం అనుకుంటుంది. రామరాజు ఇంటివైపు చూస్తూ ఇంట్లో విషయం తెలియనట్లు ఉందని సేనాపతి అనుకుంటాడు. అప్పుడే రౌడీ ఫోన్ చేసి వాడికి ఆక్సిడెంట్ చేద్దామని అనుకుంటే ఒక అమ్మాయి వచ్చిందని చెప్తాడు సరేగానీ కొన్నిరోజులు ఎవరికి కన్పించకని సేనాపతి అంటాడు. ఆ తర్వాత రేవతికి తిరుపతి ఫోన్ చేసి ప్రేమకి ఆక్సిడెంట్ అయిందని చెప్తాడు. ఆ విషయం భద్రవతి విని ఏడుస్తుంది. అప్పుడే సేనాపతి లోపలికి వస్తాడు. విషయం తెలిసి షాక్ అవుతాడు. తను ఆక్సిడెంట్ చేయించింది ప్రేమకే అని అర్థం అయి కిందపడిపోతాడు.
ఆ తర్వాత ప్రేమకి చిన్నదెబ్బలు తగులుతాయి. సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్తుంది. ఎందుకు ప్రేమ నన్ను కాపాడడం కోసం నువ్వు రిస్క్ లో పడ్డావని చందు అడుగుతాడు. ఆ ప్లేస్ లో మీ తమ్ముడున్నా అలాగే చేసేదాన్ని బావ.. అక్కడ మనిషి మారారు కానీ బాధ్యత అదే కదా అని ప్రేమ అంటుంది. మరొకవైపు ప్రేమని చూడాలని సేనాపతి వాళ్ళు వెళ్తుంటే ప్రేమ వాళ్లే డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తారు. ప్రేమని చూసి సేనాపతి ఎమోషనల్ అవుతాడు. నన్ను క్షమించు ప్రేమ అని సేనాపతి అనగానే వాడెవడో ఆక్సిడెంట్ చేస్తే నువ్వు ఎందుకు క్షమించమని అంటున్నావ్ నాన్న అని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |